అనేక మంది భారత సంతతి వ్యాపారవేత్తలు ఇటీవలి లండన్ అల్లర్ల బారిన పడగా తాజాగా ఈలింగ్ గ్రీన్‌లోని సూపర్‌మార్కెట్ యజమాని రవి ఖుర్మీ లూటీకి గురయ్యారు. 40 ఏళ్ల రవి స్థానికంగా నిర్వహిస్తున్న సూపర్‌మార్కెట్ మంగళవారం అగ్నికి ఆహుతి అవ్వకముందు లూటీకి గురయింది. ఈ సూపర్‌మార్కెట్‌కు పైన ఉన్న అనేక ఫ్లాట్స్ కూడా ఈ ప్రభావానికి గురై నివాసయోగ్యానికి దూరమయ్యాయి.
"నేను రోజుకు వేల పౌండ్లు నష్టపోతున్నాను. ఇన్సూరెన్స్ సొమ్ము వచ్చే వరకూ నేను పొదుపు చేసుకున్న డబ్బుతోనే జీవించాలి, దీనికి రెండు వారాల సమయం పడుతుందని భావిస్తున్నాను. అయితే సూపర్‌మార్కెట్ తిరిగి ప్రారంభించడానికి నాలుగు నుంచి ఆరు నెలలు పడుతుంది" అని రవి ఖుర్మీ బీబీసీతో పేర్కొన్నారు. మరో ఆసియన్ 35 ఏళ్ల జాకీర్ హుస్సేన్ నాలుగు నెలల క్రితం ప్రారంభించిన గ్రీన్ మ్యాంగో కేఫ్ కూడా ఈ ప్రభావానికి గురయ్యింది.