అమెరికా, బ్రిటన్ దేశాల ప్రయోజనాల కోసమే ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్ తీవ్రవాదులపై యుద్ధం జరుగుతోందని యూఎస్ ఉపాధ్యక్షుడు జో బిడెన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. బీబీసీతో బిడెన్ మాట్లాడుతూ.. వివాదాస్పద గ్వాంటనామో బే జైలును ప్రణాళికబద్ధంగా జనవరి 2010నాటికి మూసివేయనున్నట్లు వెల్లడించారు.
అయితే ఈ జైలులో ప్రతి కేసును విడివిడిగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సెప్టెంబరు 11 దాడుల తరువాత తీవ్రవాదులపై ప్రారంభించిన యుద్ధాన్ని బిడెన్ సమర్థించారు. యూరప్‌లో, 9/11 దాడులను ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్‌ల నుంచే అల్ ఖైదా నిర్వహించిందని అమెరికా ఉపాధ్యక్షుడు పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ప్రపంచంలో అత్యంత సుశిక్షితులైన సైన్యం బ్రిటన్‌కు ఉందని, అంతేకాకుండా వారు చాలా ధైర్యవంతులని బిడెన్ కొనియాడారు. బ్రిటన్ దళాలకు అందజేసిన పరికారాలపై మాట్లాడేందుకు మాత్రం ఆయన నిరాకరించారు.