Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముంబై దాడి: నిందితుల వద్ద విచారణ వాయిదా

Advertiesment
ముంబై
, శనివారం, 4 జులై 2009 (19:47 IST)
దేశ వాణిజ్య రాజధాని ముంబైపై తీవ్రవాదులు జరిపిన దాడులకు సంబంధించి పాకిస్థాన్‌కు చెందిన నిందితుల వద్ద నిర్వహించాల్సిన విచారణ మరోమారు వాయిదా పడింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న లష్కర్ తోయిబా తీవ్రవాదుల వద్ద విచారణకు సంబంధించిన కేసును పాక్ కోర్టు వాయిదా వేసింది.

ఈ దాడులకు సంబంధించి లష్కర్ ఇ తోయిబా సంస్థకు చెందిన ముఖ్య నేత జహీర్ రెహ్మాన్ లఖ్వీతో పాటు.. ఐదు మందిపై రావల్పిండిలోని తీవ్రవాద వ్యతిరేక కోర్టులో కేసు దాఖలైంది. ఈ కేసును న్యాయమూర్తి షాహీ మహ్మద్ విచారణ జరుపుతున్నారు.

ఈ పరిస్థితుల్లో ఆయన్ను ఆకస్మికంగా మరో కోర్టుకు బదిలీ చేశారు. దీంతో ఈ నేపథ్యంలో శనివారం జరగాల్సిన కేసు విచారణ వాయిదా పడింది. అయితే, ఈ కేసు విచారణకు సంబంధించి న్యాయమూర్తిని ఇంకా నియమించక పోవడంతో కేసు విచారణ జులై 18వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.

Share this Story:

Follow Webdunia telugu