ఇరాన్ దేశం ఇప్పుడు ఓ కొత్త యుగంలోకి ప్రవేశిస్తోందని ఆదేశాధ్యక్షుడు మహమూద్ అహ్మదీ నెజాద్ అన్నారు.
తమ దేశం కొత్త యుగంలోకి ప్రవేశిస్తోందని, దేశంలో నెలకొన్న ప్రపంచ సవాళ్ళను అధిగమించేందుకు ఇరాన్ ప్రజలు తనకు సహకరించాలని నెజాద్ ఆ దేశ పౌరులకు పిలుపునిచ్చారు.
తాము ప్రస్తుతం అంతర్గత మరియు బాహ్య ప్రపంచంలో నెలకొన్న పరిణామాలనుంచి గుణపాఠం నేర్చుకుని ఓ కొత్త యుగంలోకి ప్రవేశిస్తున్నామంటు దీనికి ప్రజల సహాయ సహకారాలుకూడా తోడ్పడితే మరింత ముందుకు దూసుకుపోగలమని ఆయన మంగళవారంనాడు ప్రభుత్వ టీవీ ఛానెల్‌లో ప్రసంగించినట్లు సమాచార ఏజెన్సీ డీపీఏ తెలిపింది.
తమ దేశానికి పశ్చిమ దేశం ఇక్కడ జరిగిన ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమ దేశంపై పోరాడేందుకు సిద్ధంగా ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఇదిలావుండగా ఇరాన్‌లో ఈ మధ్యనే జరిగిన ఎన్నికలలో అహ్మదీ నెజాద్ నెగ్గినట్లు రెండవ సారి ప్రకటించడంతో తెహ్రాన్‌లో ఆయనకు విరుద్ధంగా ప్రదర్శనలు జరిగిన విషయం విదితమే.
కాగా ఈ కుట్ర వెనుక విదేశీ హస్తం ఉందనేది ఆయన అనుమానంగా తోస్తోందని అక్కడి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.