పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి బేనజీర్ భుట్టో హత్యలో తన ప్రమేయం ఉందని వస్తున్న ఆరోపణలను ఆ దేశ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ తోసిపుచ్చారు. బేనజీర్ భుట్టోకు సరైన భద్రత కల్పించలేదనే ఆరోపణలను లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ముషారఫ్ ఖండించారు.
ఇదిలా ఉంటే భుట్టో హత్యపై దర్యాప్తును ఐక్యరాజ్యసమితికి అప్పగించడం జాతీయ భద్రతా సంస్థలను అవమానపరచడమేనని చెప్పారు. వాటిపై నమ్మకం ఉంచలేకపోవడమేనన్నారు. ఐక్యరాజ్యసమితి కూడా భుట్టో దర్యాప్తులో స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు జరిపిన దర్యాప్తు ఫలితాలనే వెల్లడిస్తుందని ముషారఫ్ పేర్కొన్నారు.