అమెరికా విదేశాంగ కార్యదర్శిగా భారత్‌లో తొలిసారి అడుగుపెడుతున్న హిల్లరీ క్లింటన్ శుక్రవారం మాట్లాడుతూ.. పాకిస్థాన్‌తో చర్చల విషయంలో తాము మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఎటువంటి ఒత్తిడి తీసుకురాబోమని స్పష్టం చేశారు. హిల్లరీ క్లింటన్ శుక్రవారం భారత్‌లో అడుగుపెట్టనున్నారు.
ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. పాకిస్థాన్‌పై చర్చలు జరపాలని తాము ఏ రకంగా భారత్‌పై ఒత్తిడి చేయమన్నారు. పాకిస్థాన్‌తో చర్చలు జరపాలని అమెరికా ఒత్తిడి చేసే అవకాశం ఉన్నట్లు భారత్‌లో అనుమానాలు లేకుండా చేసేందుకు హిల్లరీ ఈ ప్రకటన చేశారు.
పాకిస్థాన్ సరిహద్దుల్లో భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న తీవ్రవాద గ్రూపుల ఆటకట్టించేందుకు పాకిస్థాన్‌కు కొంత సమయం ఇవ్వాలని అమెరికా ప్రభుత్వం కోరే అవకాశం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. తొలిసారి అమెరికా విదేశాంగ కార్యదర్శిగా భారత పర్యటన చేపట్టిన హిల్లరీ క్లింటన్ ఓ వార్తా ఛానల్‌తో మాట్లాడుతూ.. ఆసియా ప్రాంతంలో భారత్ తమకు కీలక భాగస్వామి అని తెలిపారు.
భారత్‌తో చారిత్రాత్మక పౌర అణు సహకార ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అమెరికా కట్టుబడి ఉందన్నారు. ఇదిలా ఉంటే తీవ్రవాదంపై పోరు విషయంలో పాకిస్థాన్ నిబద్ధత చూపుతోందని పేర్కొన్నారు. పాక్ ప్రభుత్వం తీవ్రవాదులపై జరుపుతున్న పోరాటం ఆ దేశ ప్రజలకు విశ్వాసం కలుగుతోందని, పాకిస్థాన్ సరైన మార్గంలోనే వెళుతున్నట్లు తాము భావిస్తున్నామని చెప్పారు.