పటిష్టమైన లోక్‌పాల్ బిల్లు కోసం భారత్‌లో నెలకొన్న తాజా పరిస్థితులపై అమెరికా స్పందించింది. అది భారత్ అంతర్గత వ్యవహారమని, ఇందులో తాము జోక్యం చేసుకోలేమని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ ప్రితనిధి విక్టోరియా న్యూలాండ్ స్పష్టం చేశారు.
దీనిపై న్యూలాండ్ మాట్లాడుతూ లోక్‌పాల్ బిల్లు విషయమై దేశంలో కొనసాగుతున్న నిరసనలను భారత్ అంతర్గత వ్యవహారంగా తాము భావిస్తున్నట్టు చెప్పారు. దేశంలో నెలకొన్న తాజా రాజకీయ వివాదాలను, అవినీతి విషయంలో ప్రజల ఆందోళనలను భారత్ ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించుకోగలదనే విశ్వాసం తమకుందన్నారు.
ఈ విషయంలో అమెరికా ఎలాంటి జోక్యం చేసుకోబోదని, పాత్ర పోషించదని చెప్పారు. శాంతియుతమైన భావ ప్రకటనా స్వేచ్ఛకు తామెలాగైతే మద్దతు ఇస్తున్నామో.. అన్ని దేశాలు, పార్టీలు కూడా అదేవిధంగా నడుచుకునేలా అమెరికా ప్రోత్సహిస్తుందని ఆయన చెప్పారు.