ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై మళ్ళీ దాడులు జరిగాయి.
శుక్రవారం రాత్రి మెల్‌బోర్న్ నగరంలో ముగ్గురు భారతీయ విద్యార్థులపై అజ్ఞాత వ్యక్తులు దాడులకు పాల్పడి వారి వద్దనున్న సొమ్మును దోచుకున్నారు.
ఆస్ట్రేలియాకు చెందిన కొందరు దుండుగులు మెల్‌బోర్న్ రైల్వే స్టేషన్‌లో భారతీయ విద్యార్థులపై దాడులకు పాల్పడ్డారని ఆస్ట్రేలియాకు చెందిన ది ఏజ్ అనే పత్రిక వెల్లడించింది.
ఆ పత్రిక తెలిపిన వివరాల మేరకు ముగ్గురు భారతీయ విద్యార్థులు శుక్రవారం రాత్రి గం.10.30లకు రైలులో ఇంటికి తిరిగి వస్తున్నారు. అలాంటి సందర్భంలో కొందరు అజ్ఞాత వ్యక్తులు దాడులకు పాల్పడ్డారు.
ఈ దాడుల్లో భారతీయ విద్యార్థుల నుండి వారి చేతి గడియారాలు, మొబైల్ ఫోన్లు, డబ్బులు దోచుకుని పారిపోయారని విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పత్రిక పేర్కొంది.
ఇదిలావుండగా ఫిర్యాదును పరిశీలించి నిందితులను అదుపులోకి తీసుకుంటామనని పోలీసులు తెలిపారు.