బహిరంగ ప్రదేశాల్లో మహిళలు తమ ముఖానికి ముసుగు ధరించడాన్ని నిషేధించే ముసాయిదా చట్టాన్ని ఇటలీ పార్లమెంట్ కమీషన్ మంగళవారం ఆమోదించింది. రాజ్యాంగ వ్యవహారాల కమీషన్ జారీ చేసిన ఈ ముసాయిదాతో మహిళలు బుర్ఖా, నకీబ్ లేదా ఎటువంటి వస్త్రాన్ని ముఖానికి ధరించడం నేరం. భద్రతాపరమైన కారణాలతో దశాబ్దాల నుంచి కొనసాగుతున్న చట్టాన్ని మరింతవిస్తరించారు.
నిషేధాన్ని ఉల్లంఘించిన మహిళలకు వంద నుంచి మూడు వందల యూరోల జరిమానా విధిస్తారు. ముఖానికి వస్త్రాన్ని ధరించాలని బలవంతపెట్టిన వ్యక్తులు 30 వేల వరకూ జరిమానా చెల్లించడంతో పాటు 12 నెలల జైలు శిక్ష అనుభవించాలి. ఇటలీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టంపై ఇస్లామిక్ గ్రూప్‌లు మండిపడుతున్నాయి. కాగా ఇటలీలో సుమారు మూడువేల మంది మహిళలు తమ ముఖానికి ముసుగు ధరిస్తున్నట్లు ఒక అంచనా.