పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్, మరి కొంత మంది ఆయన కీలక సహాయకులకు ఆ దేశ కోర్టు సమన్లు జారీ చేసింది. బలూచిస్థాన్ నేత నవాబ్ అక్బర్ బుగ్తి హత్య కేసులో వీరిని విచారించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ముషారఫ్, అతని సహాయకులు అక్టోబరు 7న ధర్మాసనం ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.
బలూచిస్థాన్ హైకోర్టులోని డివిజన్ బెంచ్ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న పర్వేజ్ ముషారఫ్‌కు, మాజీ ప్రధానమంత్రి షౌకాత్ అజీజ్, మాజీ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి అహ్మద్ ఖాన్ షెర్పావో, మాజీ బలూచిస్థాన్ గవర్నర్ ఓవాయిస్ అహ్మద్ ఘని, ఇతర వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది. వీరందరూ తుదిపరి విచారణకు కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది.