Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బలమైన ఆధారాలు కావాలి: పాక్ సుప్రీం

Advertiesment
పాకిస్థాన్
ముంబయి ఉగ్రవాద దాడుల ప్రధాన సూత్రధారిగా భారత్ విశ్వసిస్తున్న జమాదుత్ దవా చీఫ్ హఫీజ్ మొహమ్మద్ సయీద్‌ను నిర్బంధించేందుకు బలమైన ఆధారాలు ప్రవేశపెట్టాలని పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఆ దేశ ప్రభుత్వాన్ని కోరింది.

నిషేధిత తీవ్రవాద సంస్థ జమాదుత్ దవా చీఫ్ హఫీజ్‌ను గృహ నిర్బంధం నుంచి లాహోర్ హైకోర్టు విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ పాక్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వారం క్రితం రెండు పిటిషన్లు దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై పాకిస్థాన్ సుప్రీంకోర్టు సోమవారం విచారణ ప్రారంభించింది.

హఫీజ్‌ను గృహ నిర్బంధంలో ఉంచేందుకు బలమైన ఆధారాలు కావాలని కోరింది. అనంతరం ఈ కేసు విచారణను సుప్రీంకోర్టులోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం మంగళవారానికి వాయిదా వేసింది. పాకిస్థాన్ కేంద్ర ప్రభుత్వం, పంజాబ్ ప్రావీన్స్ ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో హఫీజ్ నిర్బంధాన్ని కోరుతూ పిటిషన్లు దాఖలు చేశాయి.

Share this Story:

Follow Webdunia telugu