దావూద్ ముఠాలో కీలకంగా పనిచేస్తూ, పాకిస్థాన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు బంగ్లాదేశ్ అధికార వర్గాలు తెలిపాయి.
1995నుంచి బంగ్లాదేశ్‌లోనే నివసిస్తున్న ముఫ్తీ హబీబుల్లాను ఢాకా మెట్రోపాలిటిన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఢాకా పోలీసు కమిషనర్ షాహిదుల్ హోక్యూ వెల్లడించారు.
ముఫ్తీ భారత్‌లో మోస్ట్‌వాంటెండ్ క్రిమినల్ అని అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఇతను పాకిస్థాన్ ఉగ్రవాది అమీర్ రిజా ఆదేశాల మేరకు జీహాద్ కార్యక్రమాలకు రూపకల్పన చేసి అమలు చేస్తాడని పోలీసు అధికారలు చెప్పారు.
ఇదిలావుండగా ముఫ్తీ హబీబుల్లా భారతదేశంలోని కాశ్మీరీ మిలిటెంట్లకు సహకరిస్తాడని, దేశంలోని పలు పట్టణాలపై జరిగిన దాడులతో ఇతనికి ప్రత్యక్ష సంబంధముందని వారు పేర్కొన్నారు.
కాగా ఇతను దావూద్ ఇబ్రహీం అనుచరుడనికూడా వారి విచారణలో వెల్లడైనట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.