Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫ్రెంచ్ పరిశోధకురాలిని విడుదల చేసిన ఇరాన్

Advertiesment
ఇరాన్
ఇరాన్ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా నిర్బంధించిన ఫ్రెంచ్ పరిశోధకురాలని ఇరాన్ అధికారిక యంత్రాంగం ఆదివారం విడిచిపెట్టింది. టెహ్రాన్ జైలు నుంచి తమ దేశస్థురాలు విడుదలైనట్లు ఫ్రాన్స్ ప్రభుత్వం కూడా ఆదివారం సాయంత్రం ధృవీకరించింది. ఆమె ఇప్పుడు టెహ్రాన్‌లోని ఫ్రాన్స్ దౌత్యకార్యాలయ కస్టడీలో ఉన్నారు.

ఫ్రాన్స్ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ విడుదలైన ఖైదీ క్లోటిల్డే రాయిస్‌తో మాట్లాడారు. ఆమె ఆరు వారాలపాటు ఇరాన్ అధికారిక యంత్రాంగం నిర్బంధంలో ఉన్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ఫ్రాన్స్ అధికారులు తెలిపారు. గత నెలలో సద్దుమణిగిన ఇరాన్ ఎన్నికల ఆందోళన సందర్భంగా ఇరాన్ యంత్రాంగం రాయిస్‌ను అరెస్టు చేసింది.

ఆమెపై ఎన్నికల హింసాకాండను ప్రోత్సహించినట్లు క్రిమినల్ అభియోగాలు నమోదు చేశారు. దీనికి సంబంధించిన విచారణ పూర్తయ్యే వరకు రాయిస్ ఇరాన్‌లోనే ఉంటారు. ఫాన్స్ దౌత్యకార్యాలయ కస్టడీలో ఉంచి ఈ విచారణ జరిపేందుకు ఇరాన్ అధికారిక యంత్రాంగం అంగీకరించి ఆమెను ఆదివారం టెహ్రాన్ జైలు నుంచి విడిచిపెట్టింది.

Share this Story:

Follow Webdunia telugu