ఫిలిప్పైన్స్‌లో ఆదివారం సంభవించిన తైఫూన్ తుఫాన్‌కు మరో 16 మంది మృత్యువాత పడ్డారు. మరో డజన్ మందికి పైగా గాయపడినట్టు ఆ దేశ పోలీసు వర్గాలు వెల్లడించాయి. బెంగ్వెట్ అనే ప్రాంతంలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని తెలిపారు.
తైఫూన్ కారణంగా కొండ చరియలు విరిగి పడటంతో అనేక గృహాలు కూలిపోయాయన్నారు. ఈ శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన వారే ఎక్కువగా ఉన్నారన్నారు. దీనిపై సీనియర్ పోలీసు సూపరింటెండ్ లొరెటో ఎస్పినెలి మాట్లాడుతూ.. తైఫూన్ తుఫాను కారణంగా బెంగ్వెట్ ప్రొవియన్స్‌లో ఒక కుటుంబం సజీవ సమాధి అయిందన్నారు.
ఇందులో ఏడాది బాలుడు సైతం ఉన్నట్టు చెప్పారు. వీరితో పాటు మరో కుటుంబానికి చెందిన ఏడు మంది సభ్యులు కూడా మృతి చెందారని తెలిపారు. ఆదివారం ఉదయం పది గంటల ప్రాంతంలో లూసాన్ దీవికి సమీపంలోని వాయువ్య ప్రాంతానికి 80 కిలోమీటర్ల దూరంలో తైఫూన్ సంభవించినట్టు అధికారులు వెల్లడించారు.