చైనా రాజధాని బీజీంగ్ చేరుకున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు నికోలస్ సర్కోజి గురువారం ఆ దేశ అధ్యక్షుడు హు జింటావోతో ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఆర్థిక అంశాలతో పాటు తదుపరి జీ-20 సదస్సు గురించి కూడా చర్చించారు.
ఫ్రాన్స్ ఆధీనంలోని పసిఫిక్ ప్రాంతం న్యూ కలోడియాను సందర్శించడానికి వెళ్తూ బీజింగ్‌లో కొద్దిసేపు ఆగిన సర్కోజి పలు అంశాలపై జింటావోతో చర్చించారు. కాన్నెస్‌లో జరిగే జీ-20 సదస్సులో ప్రపంచ ఆర్ధికవ్యవస్థ త్వరగా కోలుకోవడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామని సర్కోజి వెల్లడించారు.
ప్రస్తుతం జీ-20 ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఫ్రాన్స్ నవంబర్‌లో కాన్నెస్‌లో జరిగే జీ-20 సదస్సుకు ఆతిధ్యం ఇస్తున్నది. చైనా, ఫ్రాన్స్‌ల మధ్య సహకారం, సమన్వయం జీ-20 దేశాల సదస్సులో సానుకూల ఫలితాలను తీసుకురావడంతో పాటు అంతర్జాతీయ ఆర్ధిక పరిస్థితి మెరుగుపడటానికి కూడా దోహదపడుతుందని సర్కోజీ తెలిపారు.