పాకిస్థాన్ మాజీ కెప్టెన్ అమీర్ సోహైల్ ఆ దేశ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ నాయకత్వంలోని పాకిస్థాన్ ముస్లీం లీగ్- నవాజ్ (పీఎంఎల్-ఎన్)లో చేరడం ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. లాహోర్లోని రాయివిండ్లో గల షరీఫ్ నివాసంలో ఆయనను కలిసిన సోహైల్ ఈ మాజీ ప్రధానమంత్రి నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేశాడు.
పీఎంఎల్-ఎన్ వేదికగా దేశ ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నట్లు టీవీ వ్యాఖ్యాతగా మారిన ఈ మాజీ క్రికెటర్ పేర్కొన్నాడు. సోహైల్ రాకను షరీఫ్ స్వాగతించినట్లు పీఎంఎల్-ఎన్ అధికారులు తెలిపారు. పాకిస్థాన్ లెజెండరీ ఆల్రౌండర్ ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే పాక్ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.