పాకిస్థాన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ ఖైదీ సరబ్జీత్ సింగ్‌కు ఈ దేశ ప్రభుత్వం కొత్త న్యాయవాదిని ఏర్పాటు చేసింది. బాంబు పేలుళ్ల కేసులో దోషిగా నిర్ధారించబడి గత 18 ఏళ్లుగా జైలుజీవితం గడుపుతున్న సరబ్జీత్ సింగ్‌కు పాకిస్థాన్ తీవ్రవాద నిరోధక కోర్టు మరణ దండన విధించిన సంగతి తెలిసిందే.
ఈ మరణశిక్షను రద్దు చేయాలని కోరుతూ సరబ్జీత్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఇటీవల పాకిస్థాన్ సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సరబ్ పిటిషన్‌పై జరిగిన విచారణకు రెండు పర్యాయాలు అతని తరపు న్యాయవాది రాణా అబ్దుల్ హమీద్ హాజరుకాలేదు. దీంతో కోర్టు ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది.
ఈ నేపథ్యంలో సరబ్జీత్ సింగ్ సోదరి దాల్బీర్ కౌర్ మాట్లాడుతూ.. రాణా అబ్దుల్ హమీద్‌పై తమకు నమ్మకం లేదని తెలిపారు. రాణా కోర్టు విచారణకు హాజరుకాకపోవడాన్ని దాల్బీర్ ప్రశ్నించారు. సరబ్జీత్ సింగ్ కొత్త న్యాయవాది ఓవైస్ షేక్ మాట్లాడుతూ.. రాణా హమీద్ నిర్లక్ష్యం వలనే కోర్టు పిటిషన్‌ను తోసిపుచ్చిందన్నారు.
కోర్టులో తాను తిరిగి తాజా పిటిషన్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు. 1990నాటికి పంజాబ్ ప్రావీన్స్ బాంబు పేలుళ్ల కేసులో సరబ్జీత్ సింగ్‌కు మరణశిక్ష విధింబడింది. ఈ మరణశిక్ష పాకిస్థాన్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ జోక్యంతో నిరవధిక వాయిదా పడింది. అనంతరం సరబ్ కోసం పాక్ ప్రభుత్వం నియమించిన న్యాయవాది మరణశిక్ష ఎత్తివేయాలని కోరుతూ పాక్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.