పాకిస్థాన్‌లోని వాయువ్య ప్రాంతమైన స్వాత్‌లోయలో ఐదుగురు తాలిబన్లు మృతి చెందగా మరో 14 మందిని అదుపులోకి తీసుకున్నట్లు మలకంద్‌కు చెందిన భద్రతా దళాలు గురువారం తెలిపాయి.
స్వాత్ లోయలోనున్న ఉగ్రవాదులను అంతమొందించేందుకుగాను పాకిస్థాన్ భద్రతా దళాలు ఆపరేషన్ రెస్క్యూ నిర్వహిస్తుండటంతో గురువారం ఐదుగురు తీవ్రవాదులను మట్టుబెట్టినట్లు భద్రతాదళాధికారులు తెలిపారు. ఇందులో భాగంగా మరో 14 మంది ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లో భద్రతాధికారులు తెలిపారు.
తాము అదుపులోకి తీసుకున్న 14 మందిని వివిధ ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నామని, పాకిస్థాన్‌లోని స్వాత్ లోయ ప్రాంతంలోనున్న ఫతేపుర్, బారా బందై, బరామా, అలోక్, మట్టా తదితర ప్రాంతాల్లో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు భద్రతాదళాధికారులు చెప్పారు.
ఇదిలావుండగా వీరిలో ఐదుగురు తీవ్రవాదులు మియాందమ్, బార్షౌర్, తిల్లిగ్రామ్ ప్రాంతాల్లో స్వచ్ఛందంగా లొంగి పోయారు. కాగా వజీరిస్థాన్ గిరిజన ప్రాంతంలో నలుగురు సైనికులు తీవ్ర గాయాలపాలైనారు.