పాకిస్థాన్‌లోని సమస్యాత్మక నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లో అమెరికా డ్రోన్ (మానవరహిత విమానం) జరిపిన దాడిలో ఐదుగురు తీ్రవాదులు హతమయ్యారని మీడియా కథనాలు వెల్లడించాయి. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులకు సమీపంలోని పాక్ గిరిజన ప్రాంతంలో అమెరికా డ్రోన్ దాడి జరిగింది.
దక్షిణ వజీరిస్థాన్‌లోన లడ్డా ప్రాంతంలో తీవ్రవాదులను తీసుకెళుతున్న వాహనాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగింది. దాడి జరిగిన ప్రాంతంలో పాకిస్థాన్ తాలిబాన్ కమాండర్ బైతుల్లా మెహసూద్ ప్రధాన స్థావరం కూడా ఉన్నట్లు అధికారిక వర్గాలు భావిస్తున్నాయి.
తాలిబాన్ తీవ్రవాదులను తీసుకెళుతున్న వాహనంపై అమెరికా డ్రోన్ క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో ఐదుగురు తీవ్రవాదులు హతమయ్యారు. ఈ విషయాన్ని ఓ గిరిజన నాయకుడు చెప్పినట్లుగా మీడియా కథనాలు పేర్కొన్నాయి.