Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాక్‌కు నిధుల సాయం: బిల్లును ఆమోదించిన యూఎస్

Advertiesment
పాకిస్థాన్
, గురువారం, 1 అక్టోబరు 2009 (10:04 IST)
మరో ఐదేళ్ల పాటు పాకిస్థాన్‌కు భారీ మొత్తంలో నిధులు అందించడానికి ప్రతిపాదించిన బిల్లును అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది. అయితే, నిధుల వినియోగంలో కొన్ని కఠిన నిబంధనలను పేర్కొంది. ఈ బిల్లు మేరకు.. వచ్చే ఐదేళ్ళలో పాకిస్థాన్‌కు అమెరికా 7.5 బిలియన్ డాలర్లను అందజేయనుంది.

ముఖ్యంగా.. పాకిస్థాన్ గడ్డపై వేళ్లూనుకున్న తీవ్రవాదాన్ని తుడిసి పెట్టాలని, తమ భూభాగంపై నుంచి ఇతర దేశాలపై దాడులు జరుగకుండా అడ్డుకోవాలని ఇలా అనేక కఠిన నిబంధనలను ఆ బిల్లులో పొందుపరిచారు.

వచ్చే 2014 సంవత్సరం వరకు ప్రతి యేడాది 1.5 బిలియన్ డాలర్ల సాయం చేయాలని ప్రతిపాదించిన బిల్లును గత వారం ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రవేశపెట్టిన బిల్లుకు అమెరికా సెనేట్ ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసిన విషయం తెల్సిందే.

దీనిపై ఆ దేశ విదేశీ వ్యవహారాల ఛైర్మన్ ఎల్.బెర్మాన్ స్పందిస్తూ.. పాకిస్థాన్‌తో పాటు ఆ దేశ ప్రజలతో మరింత సత్‌సంబంధాలు పెరగాలని కోరుకుంటుంటున్నాం. అలాగే, పాక్‌లోని ప్రజాస్వామ్య ప్రభుత్వం మరింత బలపడాలని ఆశిస్తున్నాం. దక్షిణాసియాలో శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలంటే.. పాక్‌తో కలిసి పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నొక్కివక్కాణించారు.

Share this Story:

Follow Webdunia telugu