Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాక్ చెక్‌పోస్టులపై మిలిటెంట్ల దాడి: 26 మంది మృతి!

Advertiesment
పాకిస్థాన్
పాకిస్థాన్‌లో మిలిటెంట్లు మరోమారు రెచ్చిపోయారు. ఆప్ఘనిస్థాన్ భూభూగం నుంచి దూసుకొచ్చిన వందలాది మంది మిలిటెంట్లు పాక్ సరిహద్దుల్లో ఉన్న చెక్‌పోస్టులపై మెరుపుదాడి జరిపారు. ఈ దాడిలో 26 మంది పాకిస్థాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వాయవ్య పాకిస్థాన్‌లోని చిత్రాల్ ప్రాంతంలో గల సైనిక పోస్టులపై ఈ మిలిటెంట్లు దాడి చేశారు.

తూర్పు అప్ఘనిస్థాన్ నుంచి అమెరికా పెద్ద మొత్తంలో తన సైనిక బలగాలను ఉపసంహరించుకున్న తర్వాత ఆ ప్రాంతం నుంచి మిలిటెంట్ల దాడులు పెరిగాయి. అయితే ఇప్పటి వరకు జరిగిన దాడులన్నింటి కన్నా ఇది పెద్ద దాడి కావడం గమనార్హం. ఈ దాడిలో 12 మంది పాకిస్థాన్ సైనికులు మృతి చెందారని ఈ రీజియన్‌లోని పోలీసులు ధ్రువీకరించారు. అయితే 26 మంది సైనికులు చనిపోయారని ఎక్స్‌ప్రెస్ టీవీ వెల్లడించింది.

Share this Story:

Follow Webdunia telugu