రాజకీయ నాయకుడిగా మారిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఆ దేశంలో అత్యంత ప్రజాదరణ గల నాయకుడిగా నిలిశారు. అయితే ఇమ్రాన్‌కు మిత్రుల కంటే శత్రువులే అధికంగా ఉండటం విశేషం. ఇస్లామాబాద్‌కు వెలువల విలాసవంతంగా నివసిస్తున్న ఇమ్రాన్ వచ్చే సాధారణ ఎన్నికల్లో విజయంపై ధీమాగా ఉన్నారు.
ఇటీవల జరిపిన ఒక సర్వేలో 68 శాతం మంది ప్రజలు ఇమ్రాన్‌కు అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. ఇది తన సమీప ప్రత్యర్ధి కంటే ఐదు పాయింట్లు ఎక్కువ. పారిశ్రామిక పట్టణం ఫైసలాబాద్‌లో గత నెలలో 35,000 మంది యువత అభిప్రాయాన్ని సేకరించగా అధిక భాగం ఈ మాజీ కెప్టెన్ వైపే మొగ్గు చూపారు. ఇమ్రాన్ కూడా 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు వాళ్ల ఆదరణ పొందడం కోసమే ప్రయత్నిస్తున్నాడు. కాగా అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌లు మాత్రం ఈ సర్వే వాస్తవం కాదని కొట్టిపారేశారు.