పాకిస్థాన్‌లోని సమస్యాత్మక నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లో ఉగ్రవాదులు ఐదుగురు భద్రతాధికారులను హత్య చేశారు. పోలీస్ వాహన శ్రేణిపై అనూహ్యంగా ఉగ్రవాదులు జరిపిన దాడిలో నలుగురు భద్రతాధికారులు మృతి చెందగా, ఇదే ప్రాంతంలో వేరొకచోట జరిగిన ఉగ్రవాద దాడిలో మరో అధికారి ప్రాణాలు కోల్పోయారు.
సోమవారం వేకువజామున పెషావర్ నగర సరిహద్దుల్లో ఉగ్రవాదులు పొంచివుండి చేసిన దాడిలో ఇద్దరు అధికారులు మృతి చెందగా, బుల్లెట్ గాయాలతో పోరాడుతూ మరో ఇద్దరు అధికారులు ఆస్పత్రిలో కన్నుమూశారు. ఇదిలా ఉంటే బన్ను ప్రాంతంలో రోడ్డుపక్కన ఉగ్రవాదులు అమర్చిన బాంబు పేలడంతో మరో అధికారి ప్రాణాలు కోల్పోగా, ఏడుగురు గాయపడ్డారని అధికారిక వర్గాలు తెలిపాయి.