పాకిస్థాన్ దేశానికి చెందిన సమాచార ఉపగ్రహాన్ని చైనా శుక్రవారం విజయవంతంగా ప్రయోగించింది. ఈ రాకెట్ సాంకేతిక పరిజ్ఞానంతో సహా ఈ శాటిలైట్ తయారీకి అవసరమైన నిధులను కూడా చైనా సమకూర్చింది. దీన్ని నింగిలోకి కూడా చైనానే పంపించింది. ఇటీవల భారత్ ఇదే తరహా శాటిలైట్ జి శాట్- 12ను భారత్ నింగిలోకి ప్రయోగించిన విషయం తెల్సిందే. ఈ ఉపగ్రహాన్ని భారత్ పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. దీనికి పోటీగా పాకిస్థాన్ శాటిలైట్‌ను ప్రయోగించింది.
అదే తరహాలో పాకిస్థాన్ రక్షణ శాఖ పాక్ శాట్-1 ఆర్ అనే ఉపగ్రహాన్ని చైనా సహకారంతో తయారు చేసింది. దీనికి తయారీకి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాన్ని చైనాయే సమకూర్చింది. ఆ తర్వాత లాంగ్ మార్చ్ 3బి రాకెట్ ద్వారా శుక్రవారం తెల్లవారు జామున చైనాలోని షిషాంఘ్ పరిశోధనా కేంద్రం నుంచి ప్రయోగించారు.
ఈ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించడంతో ఆ దేశ సాంకేతిక, సమాచార రంగం అభివృద్ధికి మరింతగా దోహదపడుతుందన్నారు. ముఖ్యంగా దీని సహకారంతో బ్రాడ్‌బ్యాండ్, ఇంటర్నెట్, డిజిటల్ టెలివిజన్ బ్రాడ్కాస్ట్, గ్రామీణ ప్రాంతాల్లో టెలిఫోన్ సౌకర్యాల కల్పన, టెలీ ఎడ్యుకేషన్, టెలీ మెడిసన్ తదితర వాటికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ శాటిలైట్ 15 సంవత్సరాల పాటు పాకిస్థాన్‌కు సేవలు అందించనుంది.