నిషేధిత తీవ్రవాద సంస్థ హర్కతుల్ జిహాదీ అల్ ఇస్లామీ (హుజీ) ఛీఫ్ మౌలానా యాహియాను బంగ్లాదేశ్ భద్రతా దళాలు గురువారం అరెస్ట్ చేశాయి. కేంద్ర కిషోర్‌గంజ్ జిల్లాలో మౌలానాతో పాటు ఇద్దరు సహాయకులను కూడా అదుపులోకి తీసుకొంది.
యాహియాను అరెస్ట్ చేసినట్లు బంగ్లాదేశ్ యాంటీ క్రైమ్ రాపిడ్ యాక్షన్ బెటాలియన్ ఇంటలిజెన్స్ వింగ్ ఛీఫ్ లెఫ్టినెంట్ కల్నల్ జియవుల్ అసన్ ధృవీకరించారు. ఈ ముగ్గురు ఒక ప్యాసెంజర్ బస్‌లో కిషన్‌గంజ్‌కు వెళ్తుండగా అరెస్ట్ చేసినట్లు ఆయన చెప్పారు. అరెస్ట్ అయిన ఇద్దరు హుజీ కార్యకర్తలను మొహమ్మద్ బహౌద్దీన్ (22), యార్ మొహమ్మద్ (50)లుగా గుర్తించారు. యాహియా అరాకన్ ముస్లీంల కోసం ఆఫ్ఘనిస్థాన్, మయన్మార్‌లలో పోరాడుతున్నట్లు బంగ్లాదేశ్ భద్రతా దళాలు తెలిపాయి.