నవంబరులో చైనాలో పర్యటించనున్న ఒబామా
, శనివారం, 22 ఆగస్టు 2009 (15:19 IST)
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బరాక్ ఒబామా వచ్చే నవంబరు నెల మధ్యలో చైనాలో తొలిసారి అధికారిక పర్యటన చేపట్టనున్నారు. ఈ విషయాన్ని చైనాలోని అమెరికా రాయబారి జాన్ హంత్స్‌మెన్ శనివారం బీజింగ్‌లో వెల్లడించారు. ఒబామా పర్యటనతో అమెరికా-చైనాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ యేడాది ఆఖరులో చైనా ప్రభుత్వ అధినేతలతో పాటు.. ఉన్నతాధికారులతో ఒబామా భేటీ అవుతారని, ఈ సమావేశానంతరం అమెరికా-చైనా దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇదిలావుండగా, ఉతాహ్ మాజీ గవర్నర్‌గా విధులు నిర్వహించిన జాన్ హంత్స్‌మెన్‌ను చైనా రాయబారిగా నియమించేందుకు సెనెట్ ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసిన విషయం తెల్సిందే. కాగా, ఆయన శనివారం చైనా రాజధాని బీజింగ్‌కు చేరుకున్నారు.