ఇరాన్ దేశంపై దాడిచేసే అధికారం ఇజ్రాయెల్ దేశానికి తాము ఇవ్వలేదని అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా అన్నారు.
సీఎన్ఎన్ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... ఇరాన్ దేశంపై దాడులకు తాము ఇజ్రాయెల్ దేశానికి అనుమతినివ్వలేదని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఆయన రష్యా పర్యటనలోనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాము ఇరాన్ అణుకేంద్రాలకు సంబంధించిన సమస్యలపై దృష్టి సారించి తగు పరిష్కారం కనుగొనడమే ప్రస్తుత ధ్యేయమని ఆయన అన్నారు.
ఇజ్రాయెల్ తన సొంత ప్రణాళికలపై స్వంత నిర్ణయాలు తీసుకోగలుగుతుందని ఆయన అన్నారు. ఇరాన్ లేదా మరే ఇతర దేశాలు తమ దేశ సౌభాగ్యంకోసం నిర్ణయాత్మకమైన చర్యలు చేపట్టే అధికారం వాటికి ఉందని ఆయన పేర్కొన్నారు.