Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తాలిబన్ల దాడులు : ప్రాణాలతో బయటపడ్డ ఆఫ్గన్ మంత్రి

Advertiesment
ఆఫ్గనిస్థాన్
FILE
ఆఫ్గనిస్థాన్ క్యాబినెట్ మంత్రిపై తాలిబన్లు ఆదివారం నాడు బాంబులతో దాడులు చేశారు. ఆఫ్గనిస్థాన్‌కు పశ్చిమాన ఉన్న హేరత్ పట్టణంలో ఆదివారం తాలిబన్లు రోడ్డుపక్కన పొంచివుండి ఇంధన మరియు జలవనరుల శాఖామంత్రి ముహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్‌పై బాంబులతో దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో ఆయన ప్రాణాలతో బయటపడినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

ఆదివారం ఉదయం ఖాన్‌పై జరిపిన ఈ దాడులకు తాలిబన్లే కారణమంటూ తాలిబన్ నాయకులు ప్రకటించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇస్మాయిల్ ఖాన్, జబివుల్లా ముజాహిద్‌లను అంతమొందించడమే తమ లక్ష్యమని తమ శాఖకు తాలిబన్ ప్రతినిధి ఫోన్‌లో తెలిపినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

హేరత్ పట్టణ సివార్లలో ఓ పాఠశాల వద్ద ఈ దాడులు జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇందులో ముగ్గురు సాధారణ పౌరులు మృతి చెందగా, మరో 16 మంది తీవ్ర గాయాలపాలైనట్లు స్థానికులు తెలిపారు.

ఖాన్ కాబుల్ వైపు వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగిందని, కాని అదృష్టవశాత్తు ఆయన ప్రాణాలతో బయటపడ్డారని, కాని ముగ్గురు పౌరులు మాత్రం మృతి చెందారని పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రగాయాల పాలైనవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని వారు పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu