శ్రీలంకలో ఇటీవల ముగిసిన అంతర్యుద్ధం కారణంగా నిరాశ్రయులైన మూడు లక్షల మంది తమిళ పౌరులకు సాధ్యమైనంత త్వరగా పునరావాసం కల్పించడంపై ఆ దేశ ప్రభుత్వం దృష్టిపెట్టాలని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ఎం కృష్ణ కోరారు. పుకెట్‌లో జరిగే అంతర్జాతీయ సదస్సులో భాగంగా శ్రీలంక ప్రభుత్వంతో ఇదే అంశంపై చర్చలు జరపనున్నట్లు తెలిపారు.
థాయ్‌లాండ్‌లోని పుకెట్ నగరంలో జరిగే అంతర్జాతీయ సదస్సులో భాగంగా శ్రీలంక విదేశాంగ మంత్రి రోహితా బోగోల్లగామాతో ఎస్ఎం కృష్ణ భేటీ కానున్నారు.
ఈ సమావేశం నేపథ్యంలో ఎస్ఎం కృష్ణ మాట్లాడుతూ.. తమిళ పౌరుల పునరావాసం తన చర్చల్లో ప్రధాన అజెండా కానుందన్నారు. తమిళ పౌరులకు 180 రోజుల్లోగా పునరావాసం కల్పిస్తామని శ్రీలంక ప్రభుత్వం తమకు హామీ ఇచ్చిందని తెలిపారు. తమిళుల పునరావాస కార్యక్రమాల్లో శ్రీలంక ప్రభుత్వ యంత్రాంగానికి సాయం చేసేందుకు భారత ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు.