అమెరికాలోని డెట్రాయిట్ నగరంలోనున్న ఓ బస్‌స్టాప్‌లో నిలబడి ఉన్న ఏడుగురు యువకులపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పారిపోయారు. ఆకుపచ్చ రంగుకల వాహనంలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపినట్లు స్థానికులు తెలిపారు. ఒక్కసారిగా కాల్పులు జరపడంతో ఆ యువకులు తీవ్ర రక్తస్రావానికిగురై గాయాలపాలైనారు.
వెంటనే అక్కడున్న స్థానికులు స్పందించి పోలీసులకు సమాచారం ఇచ్చి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నామని డెట్రాయిట్ పోలీస్ అధికారి తెలిపారు.
కాల్పుల్లో గాయపడినవారు 14 నుంచి 17 ఏళ్ల వయస్సువారని దుండగులు కాల్పులు జరపడానికి గల కారణం తెలియరాలేదని పోలీసులు అంటున్నారు. విచారణ జరుపుతున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.