పాప్ సంగీతంలో ఓ వెలుగు వెలిగిన మైఖేల్ జాక్సన్ తను మరణించాక కూడా పాప్ సంగీత సామ్రాజ్యంలో శాశ్వతంగా నిలిచిపోవాలనుకునేవారని, అందుకు తనకు తానుగా క్లోనింగ్‌ను కోరుకున్నారని ఆయన డ్రైవర్ అల్ బోమన్ తెలిపారు.
వాకో... జాకో అని మీడియా ముద్దుగా పిలిచే జాక్సన్ తన స్నేహితుడు యూరీ జెల్లర్తోపాటు మానవ క్లోనింగ్‌పై లాస్ వేగాస్‌లో జరిగిన ఓ సమావేశానికి హాజరయ్యారని జాక్సన్ డ్రైవర్ చెప్పినట్లు లండన్‌కు చెందిన 'ది మిర్రర్' పత్రిక తెలిపింది. ఆ సమావేశంలో క్లోనింగ్‌పై రేలియన్స్ అనే బృందం వివరించగా జాక్సన్ ఎంతగానో ఆకర్షితుడయ్యారని ఆ పత్రిక పేర్కొంది.
తనను క్లోనింగ్ చేసే వీలుందా అని ఆ తర్వాత జాక్సన్ ఆ బృందాన్ని అడిగినట్టు తెలిసింది. ఇలా వారిని అడిగేటప్పుడు జాక్సన్ చాలా ఉత్సాహంగా కనిపించాడని, చిన్నపిల్లాడిలా గెంతులేశాడు. క్లోనింగ్‌కు కల అవకాశంపై యూరీతో మాట్లాడాడు.
యూరీ రెండు చేతులూ పట్టుకుని... ఎంత ఖర్చయినా ఫర్వాలేదు, నేను క్లోనింగ్ చేయించుకోవాలనుకుంటున్నాను అని మైఖేల్ జాక్సన్ చెప్పినట్లు బోమన్ వివరించారు. 2002లో జరిగిన ఆ సమావేశానికి జాక్సన్, యూరీతో పాటు బోమన్ కూడా వెళ్లారు.
తన శరీరం అంతరించిపోకూడదని, తన శరీరంలోని కొద్ది భాగాన్ని క్లోనింగ్ చేయాలని జాక్సన్ చెప్పారు. 1996లో బ్రిటన్‌లో డాలీ అనే గొర్రెను క్లోనింగ్ చేసిన విషయాన్ని జాక్సన్ ఎప్పుడూ తన వద్ద ప్రస్తావిస్తూ ఉండేవారని ఆయన అన్నారు. ఆయన క్లోనింగ్ అంటే ఎంతో ఇష్టపడేవారని బోమన్ తెలిపారు.
మనుషులను క్లోనింగ్ చేస్తారని తెలిసి సమావేశం తర్వాత జాక్సన్ రేలియన్స్ బృందంలోని డాక్టర్ బోయిసెలియర్ను సంప్రదించారని తెలిసిందనీ, ఆ తర్వాత ఏమైందీ అంతుచిక్కని రహస్యంగానే ఉండిపోయిందనీ బోమన్ అశ్రునయనాలతో తన బాస్‌కు అంతిమ వీడ్కోలు పలికినట్లు ఆ పత్రిక తెలిపింది.