ప్రవాస జీవితాన్ని గడుపుతున్న ట్యునీషియా మాజీ అధ్యక్షుడు జినే ఎల్ అబిదినే బెన్ అలీపై అవినీతి, నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలతో నమోదైన పలు కేసుల విచారణ నేడు ప్రారంభం కానుంది. బెన్ అలీతో పాటు ఆయన అనుచరులు ఇద్దరు కూడా విచారణ ఎదుర్కోనున్నారు.
23 సంవత్సరాల సుదీర్ఘ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీవ్ర స్థాయిలో తిరుగుబాటుకు దిగడంతో బెన్ అలీ గత జనవరిలో సౌదీ అరేబియాకు పారిపోయాడు. ఇప్పటికే రెండు కేసుల్లో స్థానిక ట్యూనిష్ న్యాయస్థానం ఈ మాజీ అధ్యక్షుడికి 50 సంవత్సరాల శిక్షను విధించింది. నేడు కోర్టు మరో రెండు కేసుల్ని విచారించనుంది.
ఆయుధాలు, డ్రగ్స్, పురాతన సంపద కలిగినందుకు బెన్ అలీకి 15 సంవత్సరాల శిక్షను విధించిన కోర్టు మరో కేసులో ఈ మాజీ నియంతతో పాటు ఆయన భార్యకు 35 ఏళ్ల శిక్షను ఖరారు చేసింది.