Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జులైలో రష్యా, చైనా ఉమ్మడి సైనిక విన్యాసాలు

Advertiesment
రష్యా
వచ్చే నెలలో రష్యా, చైనా దేశాలు ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహించనున్నాయి. రష్యా మిలిటరీ ఉన్నతాధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇరుదేశాల మిలిటరీ సంబంధాలను పటిష్టపరుచుకునే చర్యల్లో భాగంగా ఈ ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ సైనిక విన్యాసాల్లో రష్యా, చైనాలకు చెందిన 2600 మంది సైనికులు పాల్గొంటారు. రష్యా నుంచి 20 యుద్ధ విమానాలు కూడా ఇందులో పాల్గొంటాయి. రష్యా ఆర్మీ డిప్యూటీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ సెర్గీ అంతోనోవ్ ఐదు రోజులపాటు జరిగే ఈ సైనిక విన్యాసాలను "పీస్ మిషన్ 2009"గా వర్ణించారు. ఇవి రెండు దేశాల భూభాగాల్లో జులై 22-26 మధ్య జరుగుతాయి.

Share this Story:

Follow Webdunia telugu