దివంగత పాప్ సంగీత సామ్రాట్ మైఖేల్ జాక్సన్ మృతికి సంబంధించిన శవపరీక్ష నివేదిక వెలువడేందుకు మరింతకాలం పట్టనుంది.
ప్రముఖ పాప్ సంగీతజ్ఞుడు మైఖేల్ జాక్సన్ శవపరీక్ష నివేదిక అందేందుకు మరో రెండు వారాలు పట్టవచ్చని వైద్యులు తెలిపారు. జాక్సన్ గత నెల 25న దివంగతులైనారు.
జాక్సన్ శవపరీక్ష నివేదిక అందేందుకు మరింతకాలం పట్టవచ్చని వైద్యులు తెలిపినట్లు లాస్ ఏంజెల్స్‌లోని కౌంటీ కార్నర్ కార్యాలయం తెలిపిందని ఓ వార్తా ఏజెన్సీ తెలిపింది.
ఇదిలావుండగా జాక్సన్ మృతి గుండెపోటు కారణంగానే జరిగిందని వైద్యులు తొలినుంచి చెపుతూవస్తున్నారు.
కాగా అతని మృతికి కారణాలు కేవలం అతనికి అత్యధికమైన డోసులో మాదక ద్రవ్యాలు ఇచ్చివుంటారని అతని సోదరి చెప్పడం గమనార్హం.
ఏది ఏమైనప్పటికీ శవపరీక్ష నివేదిక అందితేగాని అసలు విషయం బయటపడదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.