ఒక ప్రదర్శనలో పాల్గొనేందుకు గానూ ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనాలో పర్యటించనున్న పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ఆ దేశ ఉపప్రధానితో సమావేశం కానున్నారు. విదేశాంగమంత్రి హీనా రబ్బానీ ఖర్ ప్రస్తుత చైనా పర్యటన ముగిసిన వెంటనే జర్దారీ కూడా చైనాలో పర్యటించనున్నారు.
జర్దారీ ఉరుంకీలో చైనా ఉపప్రధాని లీ కెక్వంగ్‌తో భేటీ అవుతారని పాక్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి తెహ్మినా జాంజ్వా గురువారం వెల్లడించారు. చైనా-యురేసియా ప్రదర్శన ఉరుంకీలో జరుగనుంది. జర్దారీ ఉరుంకీలో చైనా కార్పోరేట్ రంగ అధిపతులను కూడా కలుస్తారని ఆమె తెలిపారు. చైనాతో పాటు యురేసియాతో వాణిజ్యాన్ని పెంచే భాగంగా అధ్యక్షుడు జర్దారీ చైనా పర్యటన జరుగుతుందని ఒక న్యూస్ ఏజెన్సీ తెలిపింది. జర్దారీ సెప్టెంబర్ 1, 2 తేదీల్లో తజికిస్థాన్‌లో కూడా పర్యటిస్తారు.