ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న హింసాత్మక కార్యకలాపాల కారణంగా గాంధీజీ సిద్ధాంతాలను ప్రతి ఒక్కరు అలవరుచుకోవాలని అరబ్ లీగ్ నాయకులు అభిప్రాయపడ్డారు.
మహాత్మాగాంధీ 140వ జన్మదిన వేడుకలు, అంతర్జాతీయ అహింసా దినోత్సవ వేడుక సందర్భంగా అరబ్ దేశంలో భారతీయ దౌత్యకార్యాలయం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న అరబ్ లీగ్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లుడుతూ... ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అసాంఘిక కార్యకలాపాల కారణంగా మహాత్మాగాంధీ సిద్ధాంతాలను ప్రతి ఒక్కరు అలవరచుకొని పాటించాలని అరబ్ లీగ్ ప్రధాన కార్యదర్శి అమర్ మూసా పిలుపునిచ్చారు.
భారతదౌత్యాధికారి ఆర్.స్వామినాథన్ ప్రారంభోపన్యాసంతో ప్రారంభమైన ఈ సభలో పాల్గొన్న వక్తలు గాంధీ సిద్ధాంతాలను ప్రతి ఒక్కరు పాటించాలని, వివిధ దేశాల మధ్య సత్సంబంధాలను కొనసాగించేందుకు గాంధీ సిద్ధాంతాలు దొహదపడతాయని వారు పేర్కొన్నారు.
గతంలో భారతదేశంతో తమ దేశాలకున్న పటిష్టమైన సంబంధాలను వారు ఈ సందర్భంగా స్మరించుకున్నారు.