బ్రెజిల్ రాజధాని రియో డి జెనీరో నుంచి పారిస్ వెళుతూ అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయిన ఎయిర్‌ఫ్రాన్స్ జెట్ విమానం.. ఆకాశంలోనే రెండు ముక్కలు అయిందని ఆదివారం మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ విమాన ప్రమాదంలో 228 మంది ప్రాణాలు కోల్పోయారు.
టాకాఫ్ తీసుకున్న నాలుగు గంటల తరువాత రాడార్ స్క్రీన్‌పై అదృశ్యమైన ఎయిర్‌ఫ్రాన్స్ జెట్ అనంతరం సముద్రంలో కూలిపోయింది. ఈ విమాన ప్రమాదంలో జరిగిన దర్యాప్తులో విమానం ఆకాశంలోనే రెండు ముక్కలయిందని తెలుస్తోంది.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని పరిశోధకలు నిర్ధారణకు వచ్చారు. విమానం కూలిపోయిన ప్రాంతంలో దొరికిన మృతదేహాలను పరిశీలించిన అనంతరం.. వారు సముద్ర ఉపరితలాన్ని తాకిన అనంతరం మృతి చెందారని సండే టైమ్స్ కథనం వెల్లడించింది.