పాప్ రారాజు మైఖేల్ జాక్సన్‌కు అతని వ్యక్తిగత వైద్యుడు కన్రాడ్ ముర్రే కిల్లర్ డ్రగ్ ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. ప్రాణానికే హాని తలపెట్టే అత్యంత శక్తివంతమైన మందును జాక్సన్‌కు ఇవ్వడం వల్ల చనిపోయినట్లు తెలుస్తోంది.
మైఖేల్ జాక్సన్ మరో 24 గంటల్లో చనిపోతాడనగా ముర్రే అనస్తటిక్ ప్రొపోఫోల్ ఇచ్చాడనీ, ఆ మందు ప్రభావం వల్లనే జాక్సన్ మృతి చెందాడని సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి.
కాగా ముర్రే అటువంటి ప్రాణాంతకమైన మందు ఇచ్చాడన్న అంశంపై ముర్రే తరపు న్యాయవాదులు ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే అంతకుముందు కన్రాడ్ ముర్రే జాక్సన్‌కు ఎటువంటి ప్రమాదకరమైన మందులు వాడలేదని వారు వాదించారు. జూన్ 25న జాక్సన్ మృతిచెందిన సమయంలో ముర్రే ఆయన ప్రక్కనే ఉన్నారు.
ఇదిలావుంటే గతవారం టెక్సాస్ అధికారులు ముర్రే హస్టన్ మెడికల్ ఆఫీసును తనిఖీ చేశారు. ఈ తనిఖీలో వారికి లభ్యమైన కొన్ని ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.