భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య చర్చలు తిరిగి ప్రారంభించేందుకు కాశ్మీరే కీలకాంశం కానక్కర్లేదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అభిప్రాయపడ్డారు. భారత్, పాకిస్థాన్‌లు తమకు మంచి మిత్రదేశాలని ఆయన ఒక ప్రవేట్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య సంబంధాలపై ఆయన మాట్లాడారు.
ఇరు దేశాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోమని, అయితే, తమవంతు సాయం చేస్తామని ఆయన చెప్పారు. ఉగ్రవాదంపై సాగిస్తున్న యుద్ధం కోసమే పాకిస్థాన్‌కు తాము ఆర్థిక సాయం అందిస్తున్నామని ఒబామా ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.