Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కామొరోస్ ద్వీపాల్లో కూలిన యెమెన్ విమానం

Advertiesment
యెమెని ప్రభుత్వ ఎయిర్లైన్స్
150 మంది ప్రయాణికులున్న యెమెన్ విమానం హిందూమహాసముద్రంలోని కామొరోస్ ద్వీపాల్లో కూలిపోయింది. యెమెన్ ప్రభుత్వం నడుపుతున్న యెమెనియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం ఆచూకీ ఇప్పటివరకు తెలియరాలేదు. ఈ విమానంలోని ప్రయాణికుల్లో ఎవరూ బతికిబయడే అవకాశం లేదని కామొరోస్ ఉపాధ్యక్షుడు ఇది నాధోయమ్ ఓ వార్తా సంస్థతో చెప్పారు.

ఈ విమాన ప్రమాదం మంగళవారం వేకువజామున జరిగింది. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది. కామొరోస్ రాజధాని మొరానీలోని యెమెనియా కార్యాలయానికి ప్రభుత్వ అధికారి ఒకరు విమానం సముద్రంలో కూలిపోయిందని సమాచారమిచ్చారు. యెమెనియా ఎయిర్‌లైన్స్‌లో 51 శాతం వాటా యెమెన్ ప్రభుత్వం, మిగిలిన 49 శాతం వాటా సౌదీ అరేబియా ప్రభుత్వం కలిగివున్నాయి.

యెమెనియా వెబ్‌సైట్‌లో ఉన్న షెడ్యూల్ ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో ఈ విమానం మొరానీకి వెళుతోంది. యెమెనియాకు రెండు ఎయిర్‌బస్ 330-200 విమానాలు, నాలుగు ఎయిర్‌బస్ 310-300 విమానాలు, నాలుగు బోయింగ్ 737-800 విమానాలు ఉన్నాయి. వీటిలో ఏ విమానం ప్రమాదానికి గురైందో స్పష్టంగా తెలియరాలేదు. కూలిపోయిన ప్రదేశం కూడా తెలియదు.

ఈ విమానంలో సముద్రంలో కూలిపోయిందని కామొరాన్ పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ దేశానికి సముద్రంలో సహాయక కార్యక్రమాలు చేపట్టే సామర్థ్యం లేకపోవడం గమనార్హం. గ్రాండే కామొరే, అంజోవాన్, మొహెలీ అనే మూడు ద్వీపాలను కలిపి కామొరాన్‌గా పిలుస్తారు.

గతంలో ఇథియోపియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 767 విమానాన్ని కొందరు దుండగులు హైజాక్ చేశారు. హైజాక్ అయిన ఈ విమానం కామొరోస్ ద్వీపాల సమీపంలో సముద్రంలో కూలిపోయింది. 1996లో జరిగిన ఈ దుర్ఘటనలో విమానంలోని 175 మంది ప్రయాణికులు, సిబ్బందిలో 125 మంది మృతి చెందారు.

Share this Story:

Follow Webdunia telugu