బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 భద్రతా యంత్రాంగంలో ఇద్దరు సిక్కులు చోటు దక్కించుకున్నారు. సిక్కులు బ్రిటన్ రాయల్స్ గార్డ్స్‌లో చోటు దక్కించుకోవడం ఇదే తొలిసారి. సిమ్రాన్‌జిత్ సింగ్ (26) బ్రిటన్ రాణి, ఆమె ఆభరణాల భద్రతా విధుల్లో పాల్గొన్న తొలి సిక్కుగా నిలిచారు.
మరో సిక్కు యువకుడు సర్వజీత్ సింగ్ (28) కూడా బ్రిటన్ రాణి భద్రతా సిబ్బందిలో ఉన్నారు. వీరిద్దరూ బ్రిటీష్ ఆర్మీలో పనిచేస్తున్నారు. సిమ్రాన్‌జీత్ సింగ్ ఇప్పుడు బకింగ్‌హామ్ ప్యాలస్ వద్ద విల్ట్‌షైర్‌లో ఉన్న 21వ సిగ్నల్ రిజిమెంట్‌లో ఉన్నారు. సుఫోల్క్‌లోని ఆర్మీ ఎయిర్ కార్ప్స్ మూడో రెజిమెంట్‌లో సర్వజీత్ సింగ్ విధులు నిర్వహిస్తున్నారు.