జపాన్ దేశంలోని ఉద్యోగులకు 60 సంవత్సరాలకు మునుపు స్వతంత్రంగా రిటైర్‌మెంట్ అయ్యే అవకాశం లేకుండే చేసేందుకు కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
ప్రస్తుతం ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన పార్టీ గతంలో ఎన్నికలలో చేసిన వాగ్దానం మేరకు ఆ పార్టీ ప్రస్తుతం దేశంలోని ఉద్యోగులను అరవై సంవత్సరాలకు ముందు రిటైర్‌మెంట్ ఇచ్చేందుకు తీసుకునే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించనుంది.
అక్కడ రిటైర్‌మెంట్ వయసు అరవై సంవత్సరాలుగా ఉంది. కాని కొందరు ప్రభుత్వోద్యోగులు ముందుగానే రిటైర్ అయ్యేందుకుగాను వీఆర్ఎస్ తీసుకుని తమ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించేందుకు ప్రయత్నిస్తుండటంతో ప్రభుత్వపు పనిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఈ వీఆర్ఎస్ అమలును నిలిపివేయాలని భావిస్తున్నట్లు ప్రభుత్వాధికారులు తెలిపారు.