Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇరాన్: అహ్మదీనెజాద్ వ్యతిరేకులపై కేసులు

Advertiesment
విప్లవ కోర్టు
ఇరాన్‌లో జూన్‌లో జరిగిన వివాదాస్పద అధ్యక్ష ఎన్నికల అనంతరం అధ్యక్షుడు అహ్మదీనెజాద్ విజయానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున జరిగిన ఆందోళనలో అరెస్టు చేసినవారిపై అధికారిక యంత్రాంగం కేసులు పెట్టింది. టెహ్రాన్‌లోని ఓ న్యాయస్థానంలో శనివారం ఈ కేసుల విచారణ ప్రారంభమైంది. ఇదిలా ఉంటే ఇరాక్ అధ్యక్షుడిగా నెజాద్ ఈ నెల 5న తిరిగి ప్రమాణస్వీకారం చేయనున్నారు.

అహ్మదీనెజాద్ వ్యతిరేక వర్గంపై పెట్టిన కేసుపై టెహ్రాన్ విప్లవ కోర్టు విచారణ జరుపుతోంది. నెజాద్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేసిన ఓ గ్రూపుపై విచారణ ప్రారంభమైందని అధికారిక వర్గాలు చెప్పినప్పటికీ, ఈ గ్రూపులో ఎంత మంది వ్యక్తులున్నారో వెల్లడించలేదు. ఈ గ్రూపులో 30 మంది నెజాద్ వ్యతిరేకులు ఉన్నట్లు వార్తాసంస్థలు పేర్కొన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu