ఇరాక్‌లో మంగళవారం సంభవించిన బాంబు పేలుళ్లలో మృతి చెందినవారి సంఖ్య 21కి పెరిగిందని అధికారిక వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరిగిన బాంబు దాడులు ఇరాక్ పౌరుల్లో భయాందోళనలు సృష్టించాయి. ఇరాక్ నగరాల నుంచి అమెరికా సైన్యాన్ని ఉపసంహరించిన మూడు వారాల తరువాత వరుసగా ఇటువంటి బాంబు దాడులు జరుగుతున్నాయి.
బాగ్దాద్, బాఖుబా, రమది ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు సంభవించాయి. పేలుళ్లలో 120 మందికిపైగా పౌరులు గాయపడ్డారని అధికారిక వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఇదిలా ఉంటే ముందురోజు జరిగిన బాంబు దాడుల్లో ఏడుగురు పోలీసు అధికారులు, ఓ సైనికుడు మృతి చెందారు.
ఈశాన్య బాగ్దాద్‌లో మంగళవారం సంభవించిన బాంబు పేలుడులో ఐదుగురు మృతి చెందగా, 21 మంది మృతి చెందారు. జిల్లాలోని రద్దీగా ఉండే మార్కెట్‌లో మంగళవారం సాయంత్రం ఈ బాంబు పేలుడు సంభవించింది. మిగిలినవాటి కంటే ఈ పేలుడు కారణంగా ఎక్కువ నష్టం జరిగిందని అధికారులు తెలిపారు.