ఇరాకీ సేనలు మంగళవారం అధికారికంగా దేశ రాజధాని బాగ్దాద్, ఇతర నగరాల భద్రతను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. దీంతో దేశంలో అమెరికా సేనల యుద్ధానికి ముగింపు పలికే దిశగా తొలి అడుగు పడినట్లయింది. ఇరాక్ ప్రధాన నగరాలు స్వదేశీ సేనల ఆధీనంలోకి రావడంతో బాగ్దాద్‌లో సంబరాలు జరుగుతున్నాయి.
2001లో అమెరికా ఇరాక్‌లో తీవ్రవాద సంస్థలపై యుద్ధం ప్రారంభించిన అనంతరం ఆ దేశ సైన్యం అన్ని నగరాలను తమ నియంత్రణలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ల క్రితం ఇరాక్ సైన్యానికి శిక్షణా కార్యక్రమాలు ప్రారంభించిన అమెరికా సైన్యం తాజాగా వాటికి ఇరాక్ ప్రధాన నగరాల రక్షణ బాధ్యతలు అప్పగించింది. దీంతో అమెరికా సేనలు ఇప్పుడు ఆయా నగరాల బయట ఉన్న సైనిక స్థావరాలకు వెళ్లిపోయాయి. నగరాలు ఇకపై ఇరాకీ సేనల నియంత్రణలో ఉంటాయి.