Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇరాక్ యుద్ధం: బ్లెయిర్ నిర్ణయాలపై విచారణ

Advertiesment
మాజీ ప్రధానమంత్రి
బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్ ఇరాక్ యుద్ధంపై బహిరంగ విచారణను ఎదుర్కోబోతున్నారు. అమెరికాతోపాటు ఇరాక్ యుద్ధంలో పాల్గొనాలని టోనీ బ్లెయిర్ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ వివాదాస్పద నిర్ణయాలపై టోనీ బ్లెయిర్‌ను విచారించనున్నారు.

ఇరాక్ యుద్ధంపై జరుగుతున్న విచారణలో పాల్గొనాల్సిందిగా టోనీ బ్లెయిర్‌ను కోరామని దర్యాప్తు కమిటీ ఛైర్మన్ సర్ జాన్ చిల్కాట్ కోరారు. ఇరాక్ యుద్ధంపై ప్రతిపాదిత విచారణ ఎట్టకేలకు గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా తాను తీసుకున్న నిర్ణయాలపై వాగ్మూలం ఇచ్చేందుకు విచారణకు హాజరుకావాలని దర్యాప్తు కమిటీ బ్లెయిర్‌ని కోరింది.

ఈ విచారణ మొత్తాన్ని బహిరంగం జరపాలని కమిటీ నిర్ణయించింది. బహిరంగ విచారణ ఓ టీవీ షోగా మారే ప్రమాదం ఉందని గతంలో టోనీ బ్లెయిర్ హెచ్చరించారు. అయితే విచారణలో ప్రజలు వినదగిన వాగ్మూలాలన్నీ టీవీల్లో ప్రసారం అవతాయన్నారు. దేశ భద్రతతో ముడిపడి ఉన్న అంశాలపై మాత్రం విచారణను రహస్యంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu