ఇటలీ ఉత్తర ప్రాంతంలోని వియారెగియో నగరంలో గ్యాసులో నిండివున్న రెండు రైలు ట్యాకర్లు పేలడంతో పది మంది దుర్మరణం చెందారు. మరో 50 మంది గాయపడ్డారు. రెండు రైలు ట్యాకర్లు పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం సంభవించింది. ట్యాంకర్లలు పేలడంతో సమీపంలోని గృహాలకు మంటలు వ్యాపించాయి.
ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందారని మంగళవారం ఇటలీ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే గాయపడిన 50 మందిలో 37 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ)ని తీసుకెళుతున్న 14 బోగీలు రైలులో ఒక వ్యాగన్ గతరాత్రికి కాస్త సమయం ముందు పట్టాలు తప్పింది. అనంతరం అది పేలిపోయిందని అధికారులు తెలిపారు.