Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆస్పత్రి పాలైన మాజీ ఐఓసీ అధ్యక్షుడు సమరంచ్

Advertiesment
ఆస్పత్రి
, బుధవారం, 14 అక్టోబరు 2009 (10:11 IST)
స్వల్ప గుండె పోటు కారణంగా ఐఓసీ మాజీ అధ్యక్షుడు జాన్ అంటోనివో సమరంచ్ బుధవారం ఆస్పత్రిపాలయ్యారు. 89 సంవత్సరాల సమరంచ్ 1980-2001 మధ్య కాలంలో ఐఓసీ అధ్యక్షుడిగా పని చేశారు. మంగళవారం మొనాకోలో జరిగిన స్పోర్టెల్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ టెలివిజన్ ఫెస్టివల్‌లో ఆయన పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన స్వల్ప అస్వస్థతకు గురైనట్టు ఎల్ ఇక్వైప్ అనే వెబ్‌సైట్ పేర్కొంది.

ఆ తర్వాత ఆయనను మొనాకోలోని ప్రిన్సెస్ గ్రాస్ హాస్పిటల్ సెంటర్‌లో అడ్మిట్ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తదుపరి వివరాలు అందించేందుకు ఆస్పత్రి వర్గాలు ముందుకురాలేదు. ఐఓసీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో జాక్వెస్ రోగీపై సోమరంచ్ విజయం సాధించారు.

ఆ తర్వాత రెండు రోజులకే ఆయన తీవ్ర అస్వస్థకు గురికావడంతో ఆస్పత్రి పాలయ్యారు. ఐఓసీలో గౌరవ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సోమరంచ్ ఈ సంస్థ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu