ఆసియాలో ప్రధాన గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణాన్ని రష్యా శుక్రవారం ప్రారంభించింది. ఫసిఫిక్ మహాసముద్రంపై ఉన్న నౌకాశ్రయ నగరం వ్లాడివోస్టాక్ నుంచి దీనిని నిర్మిస్తున్నారు. జపాన్‌కు గ్యాసు ఎగుమతిలో ఈ పైప్‌లైన్ కీలకపాత్ర పోషించబోతుంది. వ్లాడివోస్టాక్‌లో 2012లో ఆసియా- ఫసిఫిక్ ఆర్థిక సహకార గ్రూపు (ఎపెక్) సమావేశం జరగబోతుంది.
ఈ సమావేశం సమయానికి పైప్‌లైన్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పైప్‌లైన్ నిర్మాణ పనులను రష్యా ప్రధానమంత్రి వ్లాదిమీర్ పుతిన్ ప్రారంభించారు. ఖబరోవస్క్ ప్రాంతానికి స్వయంగా వెళ్లి పుతిని పైప్‌లైన్ నిర్మాణాన్ని ప్రారంభించారు.
తూర్పు సైబీరియా, తూర్పు ఆసియాల్లోని గ్యాసు నిక్షేపాలను దేశీయ మార్కెట్‌కు అందజేయడానికి ప్రాధాన్యత ఇస్తామని పుతిన్ చెప్పారు. ఇదిలా ఉంటే రష్యా ప్రభుత్వ గ్యాసు దిగ్గజం గాజ్ప్రోమ్ మాత్రం పైప్‌లైన్ తూర్పు ఆసియా దేశాలకు, ముఖ్యంగా ఇంధనం కోసం తహతహలాడే జపాన్‌కు గ్యాసు ఎగుమతులు పెంచేందుకు బాగా ఉపయోగపడుతుందని భావిస్తుంది.