ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితి సంక్షిష్టంగా ఉన్నప్పటికీ నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే ఆ దేశం నుంచి బలగాల ఉపసంహరణ కొనసాగుతుందని అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ సోమవారం వెల్లడించింది.
పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది, యుద్ధాలు కొనసాగుతునే ఉన్నాయని వైట్ హౌస్ పత్రికా కార్యదర్శి జే కార్నీ తన రోజువారీ న్యూస్ కాన్ఫరెన్స్‌లో భాగంగా పేర్కొన్నారు. ఒబామా నాయకత్వం బలంగా ఉందని చెప్పిన కార్నీ అధ్యక్షుడు హామీ ఇచ్చినట్టుగా తాము బలగాల ఉపసంహరణ కొనసాగిస్తున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఆఫ్ఘానిస్థాన్‌లో తాలిబాన్లపై యుద్ధంలో పాల్గొంటున్న సుమారు 30,000 వేల అమెరికా బలగాలను ఈ ఏడాది ఆఖరుకు ఉపసంహరిస్తామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఇటీవల ప్రకటించారు.